SAKSHITHA NEWS

కస్తూరిబా బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 50మంది విద్యార్థునులకు పరీక్ష రాసే సామగ్రి పంపిణీ

నాదెండ్ల:స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గార్డ్స్) ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నాదెండ్ల లోని కస్తూరిబా బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 50మంది విద్యార్థునులకు పరీక్ష రాసే సామగ్రి పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి దార్ల బుజ్జిబాబు, భారత ప్రభుత్వ నోటరీ, మాజీ గవర్నమెంట్ ప్లీడరు దాసరి చిట్టిబాబు పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా విద్యార్థినులకు జనవిజ్ఞాన వేదిక ప్రచురించిన ‘సైంటిఫిక్ టెంపర్’ అనే పుస్తకాలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, షేక్ బాజీ, వడ్లనా చంద్రం, జర్రిపోతుల బుల్లిబాబు, పాఠశాల ప్రత్యేక అధికారిణి మాధవీలత, ఉపాద్యాయనులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app