SAKSHITHA NEWS

ప్రతి పేదవానికి భరోసా కల్పిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ :: షేక్ ఫిరోజ్

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలోని 20వ వార్డులో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో కనిగిరి తెలుగు యువత అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో ప్రజలకు శుభోదయం పలుకుతున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద, మధ్య తరగతి లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాచగుల్లా మోహన్, అబ్దుల్ ఖాదర్, అంజి నాయుడు, నాగేశ్వరి, మున్నా ఫ్, అజయ్, పుల్లారావు, రబ్బాని, రాము, పూర్ణ, బ్రహ్మం, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app