పోలీస్ శిక్షణా కేంద్రాలో 250 మంది స్టెపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు

Spread the love

కానిస్టేబుళ్ల శిక్షణకు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సిద్ధం: పోలీస్ కమిషనర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

స్టెపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ కోసం ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రం పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా వుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు.
తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా కొత్తగా పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుది దశకు రావడంతో వీరికి శిక్షణ నిచ్చేందుకుగాను శిక్షణ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..


అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఇటీవలే పూర్తయిందని, కటాఫ్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక తర్వాత అభ్యర్థులను శిక్షణకు పంపుతారని తెలిపారు. నూతనంగా నియామకం కానున్న పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ నిచ్చేందుకు అవసరమైన
మౌలిక సదుపాయాలతో పాటు శిక్షణ తరగతుల నిర్వహణకు అధికారులు కసరత్తు పూర్తి చేసిన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ఖమ్మం పోలీస్ శిక్షణా కేంద్రాలో 250 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శిక్షణా కేంద్రంలోని బ్యారెక్స్, బోజనశాల, విశ్రాంతి గదులు, తరగతి గదులు, అవుట్ డోర్, ఇండోర్ తరగతుల నిర్వహణ, ఇతర సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో సీటిసి ప్రిన్సిపల్ సుభాష్ చంద్ర బోస్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page