arrangements for the Republic Day celebrations should be carried out in a grand manner
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు ఘనంగా చేపట్టాలి.-ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్లు
సాక్షిత ఖమ్మం :
గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్ లు అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లాలో అమలవుచున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై ప్రసంగ పాఠం తయారుకు నివేదిక వెంటనే సమర్పించాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, జాతీయతా భావం పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖలు నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద స్టాల్స్ ఏర్పాటు,
మెడికల్ క్యాంప్, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీకి కార్యాచరణ చేయాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్వో శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.