SAKSHITHA NEWS

Arrangements for CM KCR’s assembly in an unprecedented manner

కనీవినీ ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు

150 ఎకరాల్లో 5లక్షల మందితో భారీ సభకు ముస్తాబవుతున్న ఖమ్మం

బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ విష్ణు వారియర్,మంత్రి పి ఎ కిరణ్

నేడు సభ స్థలిని పరిశీలించనున్న మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

టీఆర్‌ఎస్‌ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్,మంత్రి పువ్వాడ పిఏ రవికిరణ్ పరిశీలించారు. దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పథగామి కేసీఆర్‌ కదన శంఖారావం పూరించనున్న సభ కావడంతో భారీ ఏర్పాట్లకు ఖమ్మం వేదికైంది.

జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సభ. 5 లక్షల మంది ప్రజలు రానున్నారు. అదే విధంగా మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనునున్న చారిత్రక వేదిక కావడంతో 100 ఎకరాల్లో సభ స్థలి ఏర్పాటు చేస్తున్నారు. దానితో పాటు 50 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఖమ్మం గుమ్మం నుంచే భారత నగారా మోగనున్నది.

తెలంగాణ ఉద్యమం మొదలైనచోటు నుంచే దేశ గుణాత్మక మార్పునకు భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించనున్నారు. తెలంగాణలో ఏ జిల్లాకు రాని అవకాశం తమకు వచ్చిందనే సంతోషంతోపాటు, ఈ బహిరంగసభను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఖమ్మం ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఉన్నారు.అందులో భాగంగా నేడు మంత్రులు తన్నీరు హరీష్ రావు,పువ్వాడ అజయ్ కుమార్ సభ స్థలి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ డీసీపీ (ఏ అర్) కుమారస్వామి, ఏసీపీలు భస్వారెడ్డి, ప్రసన్న కుమార్, వేంకటేశ్, రహెమాన్, రవి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS