మిషన్ భగీరథ లీకేజీలుమనుషుల ఆరోగ్యాలతో చెలగాటమా.?

Spread the love

మిషన్ భగీరథ లీకేజీలు
మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమా.?
లీకేజీ గురించి ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
లీకేజీ సమస్యని రెండు రోజుల్లో పరిష్కరిస్తాం – మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ
లీకేజీ గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసాం – ఎంపిటిసి స్వరూప నరసింహ


చిట్యాల సాక్షిత ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం లీకేజీ పాలవుతుంది. కొన్నిచోట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు కానీ అప్పుడే లీకేజీలు ప్రారంభమయ్యాయి. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి నీరు వృధాగా పోవడం కొన్నిచోట్ల నీటి సరఫరా ఆగినప్పుడు చెత్తాచెదారం మురుగునీరు పైపులోకి పోవడం వల్ల నీరు కలుషితమవడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కోట్లు ఖర్చుపెట్టి ప్రజలకు త్రాగునీరు అందించాలని లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం ప్రారంభించింది కానీ అధికారులు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో లీకేజీలను గాలికొదిలేసారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మిషన్ భగీరథ పైపులైను పగిలి దాదాపు 2 నెలలు అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పైపులైను మురుగు కాలువకు పక్కనుండే వెళ్లడంతో లీకేజీ ఆగినప్పుడు చెత్తాచెదారం మురుగునీరు పైపులోకి వెళ్తుందని దానివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.

గత రెండు నెలల నుండి లీకేజీ జరుగుతుందని పక్కనే మురుగు కాలువ ఉండడంతో మురుగునీరు పైపులైను లోకి వెళ్లి కలుస్తమవుతుందని ఈ విషయం గురించి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలి..

దేశబోయిన స్వరూప నరసింహ
వెలిమినేడు ఎంపిటిసి -1..

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ గురించి విషయం మా దృష్టికి వచ్చిందని పైపులైను లీకేజీకి 2 రోజుల్లో మరమ్మత్తలు పూర్తి చేయిస్తాను.

రమేష్ ఏఈ
మిషన్ భగీరథ గ్రిడ్ ..

Related Posts

You cannot copy content of this page