సాక్షిత ; కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్కే సొసైటీ కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఖార్డు స్వచ్ఛంద సంస్థ నుండి స్కిల్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ తో కలిసి మైనారిటీ మహిళలకు టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ కొరకు కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఖార్డు స్వచ్ఛంద సంస్థ ద్వారా స్కిల్ భారత్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి కొరకు *ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * చొరవతో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని త్వరలో ఆర్కే సొసైటీ కమ్యూనిటీ హాల్లో మైనారిటీ మహిళల కొరకు ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాన్, షేక్ ఇస్మాయిల్, నరసింహ, సలీం, తాజ్ బి, రుబీనా, తదితరులు పాల్గొన్నారు.