SAKSHITHA NEWS

పోలీస్ అధికారులు సిబ్బంది ఆయుధాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి

జిల్లా ఎస్పీ బి బాలస్వామి

సాక్షిత మెదక్ ప్రతినిధి:

మోబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి రెండు రోజుల పాటు సిద్దిపేట జిల్లా రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిది ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది.
వార్షిక శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బంది చేసిన ఫైరింగ్ ను జిల్లా ఎస్పీ. డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. సందర్శించి అధికారులకు, సిబ్బంది చేసిన ఫైరింగ్ ను పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.స్వయంగా పాల్గొని జిల్లా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు అదేవిధంగా పోలీస్ అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ. డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పని తీరుపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాల జీని సద్వినియోగం చేసుకోవ డంతో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగ పడతాయని,రెండు రోజుల పాటు నిర్వహించే ఫైరింగ్ శిక్షణకు జిల్లాలోని సిబ్బంది అందరూ హాజరై ఫైరింగ్ చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్.ఎస్.మహేందర్,మెదక్ డి.ఎస్పీ.ఫణీంద్ర, తూప్రాన్ డి.ఎస్.పి.యాదగిరి రెడ్డి,సాయుధ దళ డి. ఎస్పీ.రంగ నాయక్,అడ్మిన్ ఆర్. ఐ.అచ్యుత రావ్,యం.టి ఆర్.ఐ.నాగేశ్వర్ రావ్,జిల్లా సి.ఐ. లు,ఎస్సైలు,ఆర్.ఎస్.ఐ లు నరేష్,భవాని కుమార్,యశ్వంత్,మహిపాల్, సుభాష్,ఆర్మురర్స్ సత్యనారాయణ,శ్రీ.సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 02 at 8.08.57 PM

SAKSHITHA NEWS