మైలవరంలో అంగన్వాడీలు రాస్తారోకో
ప్రజాశక్తి మైలవరం
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో జరుగుతున్న ధర్మా కు వెళ్ళనీయకుండా అడ్డుకున్నందుకు నిరసనగా స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు రాస్తారోకో విరమించేది లేదని నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మైలవరం ఎస్ఐ హరి ప్రసాద్ అంగన్వాడీలను ఆందోళన విరమించాలని సూచించారు. కొంతసేపు అంగన్వాడీలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. అనంతరం అంగన్వాడీలను సిఐటియు నాయకులను బలవంతంగా వ్యాన్లు ఎక్కించి మైలవరం
పోలీస్ స్టేషన్ కుతరలించారు. స్టేషన్ వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం సిఐటి యుమండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, గ్రాడివిటీ అమలు చేయాలని, కనీస వేతనం 26000 ఇవ్వాలని, మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ప్రమోట్ చేయాలని, రిటైర్మెంట్ అయిన వారికి ఐదు లక్షలు బెనిఫిట్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలుఆర్ ఆర్ విపుష్పకుమారి, కార్యదర్శి టి శారద, పి పద్మ, వి రాజేశ్వరి, సిహెచ్ శారద, బి భాయమ్మ, ఉష, సరోజినీ, ఝాన్సీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.