SAKSHITHA NEWS

Anganwadi staff serving fruits to pregnant women

image 17

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని గర్భిణీలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి . గర్భిణీలకు పండ్లు అందిస్తున్న అంగన్వాడి సిబ్బంది .

వీణవంక గర్భిణీలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తాడని ఐసిడిఎస్ సూపర్వైజర్ శశికిరణ్మయి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పోషన్ మహాన్ వారోత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమం చేపట్టగా ముఖ్యఅతిథిగా హాజరై గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 30 వరకు పోషన్ మహాన్ వారోత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు ,చిన్నారులకు అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు తమ అంగన్వాడి కేంద్రాలలో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామనే భావన లేకుండా తమ సొంత ఇంట్లోనే శ్రీమంతం జరిపించినట్లుగా అనుభూతి పొందేలా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

మాలలో ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటరమణ, అంగన్వాడీ కార్యకర్తలు ,ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS