SAKSHITHA NEWS

అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపసర్పంచ్, ఐసిడిఎస్ సూపర్వైజర్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని ఐసిఐడిఎస్ సూపర్ వైజర్ రోజా తో కలిసి ప్రారంభించిన ఉప సర్పంచ్ సాగర్ల నరేష్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు సంవత్సరాలు నిండిన పిల్లలని అంగన్వాడీలో చేర్పించాలని అన్నారు. ఇక్కడ నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం కూడా పిల్లలకు పెట్టడం జరుగుతుందన్నారు. ఆటపాటలతో క్రీడలతో ఉల్లాసబరితమైన వాతావరణంలో పిల్లలకు ప్రీస్కూల్ విద్యను బోధించడం జరుగుతుందని అన్నారు.
అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
వార్డు సభ్యులు భాగ్యలక్ష్మి
అంగన్వాడీ టీచర్లు బూరుగు అరుణ, ఇందిరా, ఎఎన్ఎం విజయ, అంగన్వాడి ఆయమ్మ లలిత, తల్లులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS