SAKSHITHA NEWS

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతలక్ష్మి, చిన్న శ్రీశైలం యాదవ్

సాక్షిత శంకర్‌పల్లి: , శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో విశ్వహిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రెటరీ అనంత్ లక్ష్మి, చిన్న శ్రీశైలం యాదవ్ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన పూజారి సాయి శివ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువు ఆలయాలను తప్పకుండా సందర్శించాలన్నారు. భక్తి భావంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు అన్నారు. ఆలయ అధ్యక్షుడు సదానందం గౌడ్, ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డిలు వారికి స్వామి వారి శేష వస్త్రంతో సన్మానించి, చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS