చంద్రబాబుకు మద్దతుగా’ లెట్స్ ఆర్టీసీ ఫర్ సిబిఎన్ ‘ పేరుతో కలిశెట్టి వినూత్న కార్యక్రమం

Spread the love

చంద్రబాబుకు మద్దతుగా’ లెట్స్ ఆర్టీసీ ఫర్ సిబిఎన్ ‘ పేరుతో కలిశెట్టి వినూత్న కార్యక్రమం

ఆర్టీసీ బస్సు, ఆటోలలో ప్రయాణించి శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమానికి చేరుకున్న కలిశెట్టి

ఆరోగ్యం క్షీణించిన చంద్రబాబును తక్షణమే ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి.. వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో అభ్యర్థించిన కలిశెట్టి

16-10-2023
శ్రీకాకుళం,కలెక్టరేట్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆపద్బాంధవుడు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆరోగ్యం క్షీణించిందని ప్రచార మాధ్యమాల్లో సమాచారం వస్తున్నందున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆసుపత్రిలో చేర్పించడం ద్వారా ఆయనకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర శిక్షణా శిబిరం మాజీ డైరెక్టర్, ఎచెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రాన్ని సమర్పించారు.

సోమవారం కలిశెట్టి అప్పలనాయుడు గారు చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ ఆర్టీసీ ఫర్ సిబిఎన్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే రోజున ఎచెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం హెడ్ క్వార్టర్ నుంచి ఆర్టీసీ బస్సులో అప్పలనాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు బయలుదేరారు. కాగా శ్రీకాకుళం వెళ్లే మార్గంలో సుభద్రపురం జంక్షన్, అల్లినగరం జంక్షన్, ఎచ్చెర్ల, కింతలిమిల్లుజంక్షన్, కుశాలపురం జంక్షన్, వెంకటాపురం జంక్షన్లలో అప్పలనాయుడు గారు ప్రయాణించే ఆర్టీసీ బస్సును ఆపి.. అదే బస్సులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కి శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ వరకు చేరుకున్నారు. అనంతరం వారంతా అప్పలనాయుడు గారితో కలిసి శ్రీకాకుళంలో జరిగే జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆటోల్లో తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా అప్పలనాయుడు గారు మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పని చేశారని, సిబిఎన్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడని, జాతీయ స్థాయి నాయకుడని పేర్కొన్నారు. ఏ ఆధారాలు లేకపోయినా రాజకీయ కక్షతో ప్రజల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని దూరం చేసేందుకు.. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని అప్పలనాయుడు గారు మండిపడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడం కారణంగా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చిందని, ఇదే సమయంలో సిబిఎన్ గారి ఆరోగ్యం క్షీణించిందని అప్పలనాయుడు గారు పేర్కొన్నారు. కనుక తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అప్పలనాయుడు గారు డిమాండ్ చేశారు. సత్వరమే చంద్రబాబునాయుడు గారిని అక్రమ కేసు నుంచి విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారిని అభ్యర్థిస్తూ గ్రీవెన్స్ కార్యక్రమంలో అప్పలనాయుడు గారు వినతి పత్రాన్ని సమర్పించారు.

Whatsapp Image 2023 10 16 At 3.17.48 Pm

Related Posts

You cannot copy content of this page