కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వారం పాటు వాయిదా వేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మూడు గంటల ఉచిత విద్యుత్ విధానాన్ని ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కోరుతున్నాను.
కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.