అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులుయూపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం

Spread the love

కాన్పూర్‌ :

దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్‌ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్‌ వై ఏరోస్పేస్‌ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్‌లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. పూర్తి స్పెక్ట్రమ్‌ మందుగుండు సామగ్రి తయారీ సముదాయాలలో ఒకటిగా మారనుంది. ఇది సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలు, పోలీసుల కోసం అధిక-నాణ్యత కలిగిన చిన్న, మధ్యస్థ, పెద్ద-స్థాయి మందుగుండు సామగ్రిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సదుపాయం భారతదేశ వార్షిక అవసరాలలో 25 శాతంగా అంచనా వేయబడిన 150 మిలియన్‌ రౌండ్లతో ప్రారంభించి, చిన్న క్యాలిబర్‌ మందుగుండు సామగ్రిని విడుదల చేయడం ప్రారంభించింది.

భారతదేశంలోని ప్రయివేట్‌ రంగంలో మొట్టమొదటిసారిగా ఉన్న ఈ అత్యాధునిక సౌకర్యాలు దేశం యొక్క స్వావలంబన, రక్షణలో సాంకేతిక పురోగతికి గణనీయ ప్రోత్సాహాన్ని అందిస్తాయి” అని అది ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే ”బాలాకోట్‌ వైమానిక దాడి ‘ఆపరేషన్‌ బందర్‌’ ఐదో వార్షికోత్సవం సందర్భంగా సౌకర్యాల ఆవిష్కరణ, భారత వైమానిక దళం చేసిన చారిత్రాత్మక ఆపరేషన్‌, ఇది బాహ్య బెదిరింపులపై భారతదేశం యొక్క వ్యూహాత్మక దఢత్వానికి నిదర్శనం,” అని ప్రకటన పేర్కొంది.

ఈ సౌకర్యాలను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, సెంట్రల్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌.ఎస్‌రాజా సుబ్రమణి జీవోసీ- ఇన్‌- సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ ఈ సౌకర్యాలలో ఉత్పత్తి చేయబడిన మందుగుండు సామాగ్రి, క్షిపణులు దేశ భద్రతకు దోహదపడటం గర్వించదగిన తరుణమని అన్నారు. ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ సీఈఓ ఆశిష్‌ రాజ్‌వంశీ తదితరులు ప్రసంగించారు.

Related Posts

You cannot copy content of this page