Ambedkar’s spirit of Swarashtra fulfilled
అంబేడ్కర్ స్ఫూర్తితో నెరవేరిన స్వరాష్ట్ర కాంక్ష
చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ విగ్రహం
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెరాస లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఘన నివాళి
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నవభారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జీవితం నేటి నమకాలిన సమాజానికి అత్యంత అవసరమని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఘనంగా నివాళులు అర్పించారు.
బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎంపీ నామ నేతృత్వంలో పార్టీ ఎంపీలు మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ జీవితం నమస్త జనులకు ఆచరణీయమన్నారు.
భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామ్యకరించిన గొప్ప మేధావి అన్నారు. ప్రతి మనిషి ఆత్మ గౌరవంతో జీవించేలా సమన్యాయంతో రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. దేశం గర్వించదగ్గ ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ న్పూర్తితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసుకున్నామన్నారు.
తెరాస ప్రభుత్వం అంబేద్కర్ చూపిన బాటలో పయనించి,దళితుల సమగ్రాభివృద్ధికి, సకల జనుల సాధికారతకు కృషి చేస్తున్నదని అన్నారు. వారి అభ్యున్నతికి బడ్జెట్లో వేయి కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.
దళిత బంధుకు అంబేద్కర్ మహనీయుడే న్పూర్తి అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకుని,సగర్వoగా గౌరవించుకున్నామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టిస్తున్నట్లు తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలు, విలువలు అనుసరిస్తూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తెరాన ప్రభుత్వం పాటుపడుతుందని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని నామ కొనియాడారు. వసుదైక కుటుంబ దృక్పధాన్ని భారత సమాజానికి అందించిన మహానీయుడు అన్నారు . అట్టడుగు వర్గాల భాగ్యవిధాత అన్నారు.
యావత్ జాతికి నిత్య స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ప్రతి వర్గానికి రాజ్యాంగంలో సమాన అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా మన జీవితాల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు. సమాజంలోని వివక్షపై అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని దేశానికి చేసిన సేవలను మననం చేసుకున్నారు. నిమ్న జాతుల అభివృద్ధికి ఆయన. చేసిన కృషి , సేవ అజరామం అని ఎంపీ నామ పేర్కొన్నారు.