SAKSHITHA NEWS

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు అయినా సందర్భం గా బాపట్ల జిల్లా సి.పి.ఐ పార్టీ సంఘీభావం

బాపట్ల పట్టణంలో సీ.పీ.ఐ పార్టీ జిల్లా కార్యాలయం విలేకరులు సమావేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రక్రియకు కంకణం కట్టుకొని పాలన సాగిస్తున్నారని సి.పి.ఐ జిల్లా నాయకులు జెల్దీ భాగ్యశ్రీధర్, బత్తుల శామ్యూల్ అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని స్థానిక 29 గ్రామాల వందలాది మంది రైతులు సోదరులు 1200 రోజులుగా అమరావతిలో సుదీర్ఘమైన నిరాహారదీక్ష చేస్తుంటే మోడీ జగన్ కు చీమకుట్టినట్టైనా లేదన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని కి 30 వేల ఎకరాలు అవసరం ఉంటుందని నేను తాడేపల్లి ప్రాంతంలో ఇంటి నిర్మాణం జరుపుతున్నానని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగింది ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడటం సరైన విధానం కాదని అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని 1200 రోజుల నిరాహారదీక్షకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని వారికి సిపిఐ బాపట్ల జిల్లా సమితి మద్దతు తెలుపుతూ అమరావతి నే రాజధాని నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని సి.పి.ఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగినది.


SAKSHITHA NEWS