సెకండ్ ANM ల అందరినీ భేషరతుగా రెగ్యులర్ చేయాలి

సెకండ్ ANM ల అందరినీ భేషరతుగా రెగ్యులర్ చేయాలి

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 23 at 2.41.37 PM

ANM ల నిరువదిక సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

సెకండ్ ఏఎన్ఎంల, అసోసియేషన్, ఏఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగముగా, 8వ రోజు, ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ సెంటర్లో, కళ్లకు గంతలతో నిరసన తెలియజేయడం జరిగినది,
ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ శాసన సభ్యురాలు, సీతక్క పాల్గొని సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ, ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపుతున్న పాలకులు, రెండవ, ఏఎన్ఎం లుగా 16 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో పోలియో చుక్కలతో ప్రారంభించి, అనేకమైన ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, అభద్రతకు గురవుతున్న సందర్భంలో, ప్రభుత్వం స్పందించి పరీక్షలతో సంబంధం లేకుండా భేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు, ఓవైపు రెగ్యులర్ కోసం వారు పోరాటం చేస్తూ ఉంటే, కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఇంకా ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నారు,

అందుకే వారిని బేసరతగా రెగ్యులర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరిని రెగ్యులర్ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు, ఒకటే కాకుండా ఇంకా హెల్త్ కార్డులు గానీ, ఎక్స్గ్రేషియా కానీ ,కారుణ్య నియామకాలుగాని, ఇంకా అనేక సమస్యలు కూడా మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, ఏఐటీయూసీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్

,
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,ఎంపీటీసీ మవురపు
తిరుపతి రెడ్డి, ముత్యాల రాజు, పైడి, సంగం నాయకులు వజ్ర స్వప్న ఆదిలక్ష్మి, సూర్యకాంతం, శకుంతల ,స్వాతి, రజిత, సోమలక్ష్మి, సునీత ,సమ్మక్క, పావని, సుగుణవతి, ధనలక్ష్మి, భాగ్యమ్మ పుష్పలత మంగ చంద్రకళ, గంగ ,ఎల్లారీశ్వరి, 56 మంది ఏఎన్ఎంలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS