All round development of 7th Ward of Kalvakurti Municipality
కల్వకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డును అన్ని విధాల అభివృద్ది చేయడానికి కృషి చేస్తా
సాక్షిత ప్రతినిధి
7వ వార్డు కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డును ప్రజల సహకారంతో అన్ని విధాల అభివృద్ది చేయడానికి కృషి చేస్తానని స్థానిక వార్డు కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు అన్నారు.
కల్వకుర్తి మున్సిపాలిటీ ఎస్సీ ఎస్పి నిధులతో 7వ వార్డులో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కౌన్సిలర్ *గోరటి శ్రీనివాసులు భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధికి మహర్దశ చేకూరుతుందని అన్నారు.
రానున్న రోజుల్లో 7వ వార్డును స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ సహకారంతో మరిన్ని నిధులతో సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వాడలోని సీసీ రోడ్డు నిర్మించబడుతుండడం తో కాలనీ ప్రజలు కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు కు కృతజ్ఞతలు తెలియ చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శివ కుమార్, నీరటి మల్లేష్, దున్న సురేష్ , గుండూరు రమేష్,అంజలి,నరేందర్,రవికాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.