*వైభవంగా చౌడమ్మగుట్ట శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో పల్లకి సేవ

Spread the love

Pallaki Seva at Sri Anjaneya Swamy Temple in Chaudammagutta

వైభవంగా చౌడమ్మగుట్ట శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో పల్లకి సేవ

– పల్లకి సేవలో పాల్గొన్న షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న

– అన్నదానం చేసిన ఆగిరు కృష్ణయ్య

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జై జై రామ నినాదాలతో ఆట పాటలతో, భజనాలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.

ఈ పల్లకి సేవలో షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న కౌన్సిలర్ లతాశ్రీ శ్రీశైలం గౌడ్ ను ఆయన అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించాలని

, అది ఈ దేవాలయం నుంచే ప్రారంభించాలని భక్తులను కోరారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం శ్రీశైలం గౌడ్ మున్సిపల్ కమిషనర్ ని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన ఆగిరు కృష్ణయ్య దేవాలయ ఆవరణలో అయ్యప్ప స్వాములకు, దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.

అదేవిధంగా పట్టణానికి చెందిన వడ్ల సిద్దురాజు చారి దేవాలయ అభివృద్ధికి 10,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా శ్రీశైలం గౌడ్ దాతలకు ధన్యవాదాలు తెలిపి శాలువా పులామాలలతో సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీశైలం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్ర చారి, కృష్ణ పంతులు, ప్రమోద్ పంతులు, సునీల్ పంతులు భక్తులందరికీ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పల్లకి సేవలో కుమార్ గౌడ్, గూదే వసంతరావు, అర్జునయ్య, తోకల దామోదర్ రెడ్డి,

అన్నారం రఘు గౌడ్, బాల రాజేష్, నరేందర్, ప్రవీణ్ యాదవ్, క్యూసెట్ శ్రీనివాస్, నారాయణ, శ్రీనివాస్, గడ్డమీది రమేష్, సుప్ప నర్సింలు, బీరయ్య, కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, కృష్ణ చారి, గోరియా నాయక్, వీఆర్వో బచ్చన్న, సత్తయ్య, గణేష్, శ్రీనివాస్, రవీందర్, మున్సిపల్ సిబ్బంది రమేష్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య మరియు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page