SAKSHITHA NEWS

Telangana Assembly Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది..

వారిలో మహిళలు 221 మంది కాగా, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్‌ జెండర్‌. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418. మహిళా ఓటర్లు కోటి 63 లక్షల వెయ్యి 705మంది. ట్రాన్స్‌ జెండర్‌ ఓటర్ల సంఖ్య 2,676..

తెలంగాణలో మొత్తం సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944. అలాగే 18-19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 9 లక్షల 99 వేల 667. పోలింగ్ కేంద్రాల సంఖ్య 35 వేల 655. దివ్యాంగుల కోసం పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు 21 వేల 686 వీల్‌ఛైర్లు సిద్ధం చేశారు. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు వుంచుతున్నారు. ఇదే సమయంలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 120 పోలింగ్‌ కేంద్రాలను నిర్వహించేది కేవలం దివ్యాంగులే. అలాగే 597 పోలింగ్‌ కేంద్రాలను మహిళలే నిర్వహించబోతున్నారు

Whatsapp Image 2023 11 29 At 8.55.04 Am

SAKSHITHA NEWS