మద్యం లేని సమాజం రావాలి – మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి
సాక్షిత, తిరుపతి బ్యూరో: దేశంలో పేదరికానికి, ప్రమాదాలకు మత్తుపానీయాలు, డ్రగ్స్ వంటివి కేంద్ర బిందువు అవుతున్నాయని, మద్యం లేని సమాజం రావాలని అందుకు యువత సహకారం తప్పనిసరి అని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎస్. వి. యూనివర్సిటీ ఆడిటోరియంలో మత్తు పానీయాల వల్ల జరిగే నష్టాలపై అవగాహన సదస్సును రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ, జిల్లా ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాజారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ హాజరయ్యారు. లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ పేదవాళ్ళు తన సంపాదనలో 70 నుండి 90 శాతానికి మద్యానికి భానిసలై ఖర్చు చేస్తూ సమాజంలో కుటుంబాలను మరింత పేదరికంగా, బాలకార్మికులుగా, అత్యాచార వ్యక్తులుగా, హత్యలు దోపిడీలకు ప్రధాన కేంద్ర బిందువు అవుతున్నారని అన్నారు. మద్యం లేని సమాజం నిర్మించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని అన్నారు. మద్యానికి భానిసలుగా ప్రపంచంలో 8 శాతం ప్రజలుంటే ఏపీలో 11 శాతంగా ఉందని అన్నారు. వ్యసనపరులకు తప్పనిసరి డి -అడిక్షన్ సెంటర్లలో ప్రభుత్వ ఇస్తున్న ఉచిత వైద్యం అందించి బాగుచేసే బాధ్యత యువత తీసుకోవాలని అన్నారు.
ఎస్.వి.యునివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రాజారెడ్డి మాట్లాడుతూ సమాజంపై యువత ప్రభావం అధికంగా ఉంటుందని, నేటి యువత సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో ప్రతి విద్యార్థి బాధ్యతగా సమాజం మద్యానికి డ్రగ్స్ కు తావు లేకుండా చూడాలని కోరారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ తన వైద్య వృత్తిలో డ్రగ్స్ , మద్యానికి భానిస అయిన చాలా మంది పిల్లల తల్లిదండ్రులను, వారి బాధలను చూశానని సమాజంలో పిల్లలు చేసే తప్పు వల్ల తల్లిదండ్రులకు చిన్నచూపు ఉంటుందని అన్నారు. మెడికల్ పరంగా ప్రస్తుతం అన్ని రకాల అడ్వాన్స్డ్ డి-అడిక్షన్ వైద్యం అందుబాటులో వుందని అన్నారు. డ్రగ్స్ , మద్యం బానిసలకు తప్పనిసరి వైద్యం అందించగలిగితే సమాజంలో కొకైన్ , డ్రగ్స్ వంటివి మత్తు పదార్థాలు అంతం అవుతాయని అందుకు యువత సహకరించాలని విన్నవించారు. గతంలో ప్రవేట్ వైద్య రంగంలోనే డి-అడిక్షన్ సెంటర్లు ఉండేవని ప్రస్తుతం ప్రతి జిల్లాలో అందుబాటులో వున్నాయని అన్నారు.
రాజేష్ కళాజాతా జాత బృందం మత్తు పానీయాల వల్ల జరిగే నష్టాలపై అవగాహనా పాటలు సభికులను ఆకట్టుకున్నాయి.
ఈ సమావేశంలో రెక్టార్ శ్రీకాంత్ రెడ్డి , ఇసి మెంబర్ ద్వారకనాధ రెడ్డి , ఎస్ఇబి తిరుపతి అర్బన్ నాగరాజ రెడ్డి, పి.ఎ.ఎస్.ఎస్. స్వచ్చంద సంస్థ మంజుల , సికాం , డి హెచ్ ఆర్ , ఎస్వి జూనియర్ కళాశాలల ఇంటర్ , డిగ్రీ విద్యార్థులు, అధ్యాపకులు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
మద్యం లేని సమాజం రావాలి – మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి
Related Posts
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
SAKSHITHA NEWS గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
SAKSHITHA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…