మహిళా కమిషన్ సభ్యురాలుచే మైనర్ బాలిక పరామర్శ

Spread the love

మహిళా కమిషన్ సభ్యురాలుచే మైనర్ బాలిక పరామర్శ

                                           సాక్షిత, తిరుపతి బ్యూరో:  ముత్యాలరెడ్డి పల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో మెనర్ బాలికపై ఇద్దరు  వ్యక్తులు అత్యాచారం కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసులు  పోక్సో చట్టం కింద  నిందితులను అరెస్టు  చేసి రిమాండు పంపడం  జరిగింది.  మైనర్ బాలికను చికిత్స నిమిత్తం  ప్రసూతి  ఆసుపత్రి కి తరలించారు   

విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సోమవారం ప్రసూతి ఆసుపత్రి కి చేరుకొని చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గజ్జల లక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఎన్ని చట్టాలు వచ్చినా.., కొంతమంది కామాందులు పసిబిడ్డలను, మహిళలను చెరపట్టి బెధిరింపులకు గురిచేసి, లొంగదీసుకోవడం పరిపాటి గా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపట్ల చట్టం కఠినంగా వ్యవరించి, ఉరిశిక్ష ను విదించాలని కోరారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెళ్ళి, మైనర్ బాలికకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడటానికి కృషి చేస్తామని గజ్జల లక్ష్మి భరోసా ఇచ్చారు.
మహిళలు ధైర్యం గా సమస్యలను ఎదుర్కోవాలని ,ఎలాంటి భయాందోళనకు ,బెదిరింపులకు గురికావొద్దని, బంగారు భవిష్యత్తు ను ఛిద్రం కాకుండా జాగ్రత్త వహించాలని గజ్జల లక్ష్మి తెలిపారు

Related Posts

You cannot copy content of this page