సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిండా ముంచారని,నీళ్లు,నిధులు,నియామకాల అని చెప్పి ఏర్పాటు చేసుకున్న ఏ ఒక్క పని సహకారం కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగలు ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు కట్టబెట్టుకున్నారని ఆరోపించారు.మంగళవారం బొమ్మలరామారం మండలం చౌదరిపల్లి,మాచాన్ పల్లి,నాయకుని తాండ,కేకే తాండ,చికటిమామిడి,మర్యాల,పిలిగుంట్ల తండాలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య మొదటి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దళిత సీఎం తో పాటు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి కెసిఆర్ ఇప్పుడు గృహలక్ష్మీ పేరుతో మూడు లక్షలు ఇస్తామని చెవుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి సీఎం కేసీఆర్ కు భయం పుట్టుకుందని బీర్ల ఐలయ్య అన్నారు.ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి.గుండాల మండలం పెద్దపడిశాల గ్రామం నుండి,సుమారు 50 మంది,చౌదరిపల్లి గ్రామంలో యువకులు,మర్యాల గ్రామానికి చెందిన సీనియర్ బిఅరెస్ పార్టీ నాయకుడు ఈదులకంటి దయాకర్ రెడ్డి,తో పాటు సుమారు 80మంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు.