ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలం లోని , ఉరుమడ్ల మరియు పెద్దకాపర్తి గ్రామంలో గలా పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు, డిసిఓ శ్రీను, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
వరి ధాన్యాన్ని తొందరగా కోనుగోలు చేయాలనీ, రైతుల వద్ద ఏలాంటి డబ్బుల వసూలు చేయవద్దని, లారీ వాళ్ళు డబ్బులు వాసులు చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షము వచ్చు సూచనలు ఉండటంవల్ల కొనుగోలు కేంద్రం ఇంచార్జ్, రైతులు వరి ధ్యానము తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సూపర్వైజర్లు, అధికారులు విధిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆర్ఐ లింగస్వామి, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.