అడ్డమీది కార్మికులు పెద్దవాళ్ళు కాదా,
ఒక్కరికి కూడా డబల్ బెడ్రూం ఎందుకు ఇవ్వలేదు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
ఎన్నికల సమయంలో దరఖాస్తు చేసుకున్న వారందరికి డబల్ బెడ్రూం ఇస్తామని హామీ ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో లక్షలాది మంది నుండి వంద రూపాయల వసూలు చేసి దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం, వారికి ఒకరోజు పని లేకుండా చేసి ధ్రువీకరణ పత్రాల కోసం వందలాది రూపాయలు కట్టించి లబ్ది పొందిన ప్రభుత్వం,నేడు నియోజకవర్గానికి కేవలం 5000 మందికి ఇస్తామంటే మిగితావాళ్ళందరిని మోసం చేసినట్లేనని కావున డబల్ బెడ్రూం ఇయ్యలేని పరిస్థితిలో కనీసం 60 గజాల స్థలమైన ఇవ్వాలని దాని కోసం సీపీఐ గా నిరంతరం పోరాటం చేస్తుందని నేడు శ్రీనివాస్ నగర్,షాపూర్ నగర్ భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ లోని జగతగిరిగుట్ట,షాపూర్ నగర్,శ్రీనివాస్ నగర్, ప్రగతినగర్,ఐడీపీఎల్ అడ్డాల వద్ద పనిచేస్తున్న వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు పేద ప్రజలని,వారికి స్వంత ఇండ్లు లేక కిరాయి కట్టుకుంటు,పని దొరకని రోజున పస్తులు ఉండే కార్మికులని డబల్ బెడ్రూంలు పొందడానికి సర్వ హక్కులు ఉన్న వారని కానీ వారికి ఎవరికి కూడా డబల్ బెడ్రూం రాకపోవడం ఈ ప్రభుత్వానికి కార్మికులపై ఉన్న ప్రేమ తెలియచేస్తుందని ఎద్దేవా చేశారు.,
ఎన్నికల సమయంలో ప్రచారం కోసం,పార్టీ కార్యక్రమాల జయప్రదం కోసం భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు వచ్చే అధికార పార్టీ నాయకులు వారికి డబల్ బెడ్రూం ఇప్పించడం కోసం అడగకపోవడం చూస్తుంటే వారు పేద ప్రజల కోసం కాకుండా తమ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నారని కావున కార్మికులు అలాంటి నాయకుల కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కబ్జాదారులకు పదుల ఎకరాలు అప్పనంగా అప్పచెప్పే అధికారులు, ప్రజాప్రతినిధులు పేదలు గుడిసెలు వేసుకుంటే తొలగించారని ఇప్పటికైనా గత 9 సంవత్సరాలుగా తమకు డబల్ బెడ్రూం వస్తుందనే ఆశతో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు డబల్ బెడ్రూంలైనా ఇవ్వాలని లేకపోతే ప్రభుత్వమే 60 గజాల స్థలం ఇవ్వాలని డ్రమాండ్ చేశారు. రానున్న రోజులో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి స్థలం దక్కేంత వరకు పోరాటం చేస్తామని ,పోరాటాలకు ప్రజలు కూడా సిద్ధం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, మండల కోశాధికారి సదానంద్,సీపీఐ నాయకులు శ్రీనివాస్, సాయిలు,ప్రభాకర్, భవన నిర్మాణ కార్మికులు యూసుఫ్,రాకేష్,హనుమంతు,పాపయ్య,కుమార్,వెంకటేశ్వర రావు, మల్లమ్మ,సుక్కు, విమల చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.