SAKSHITHA NEWS

హింసా రాజకీయాలకు బీఆర్ ఎస్ వ్యతిరేకం- ఉద్యమ సమయంలో కూడా సంయమనం పాటించి గాంధేయ వాదం వీడలేదు
*డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

ప్రచారంలో అడుగడుగునా పజ్జన్నకు ఘన స్వాగతం
బౌద్దనగర్ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బౌద్దనగర్ డివిజన్ లోని వివిధ కాలనీలు, బస్తీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ తో కలిసి వారసిగూడ, కౌసర్ మస్జిద్, పుల్లయ్య గల్లి, ఎల్ నారాయణ నగర్, మారుతి స్ట్రీట్, గొల్ల పుల్లయ్య బావి, ప్రాంతాల్లో పాదయాత్రను నిర్వహించి, ఓటర్లను కలుస్తూ వారిని పలకరిస్తూ ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్ధించారు. పద్మారావు గౌడ్ కు స్థానికులు బ్రహ్మ రధం పట్టి ఘనంగా స్వాగతం పలికడంతో పాటు ఎన్నికల్లో తమ మద్దతును ప్రకటించారు. బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ తో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, రాసురి సునీత, బీఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, బీఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, బౌద్దనగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి తో తనకు సాన్నిహిత్యం ఉందని, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సౌమ్యులని, దాడికి పాల్పడడం శోచనీయమని అన్నారు. హింస ద్వారా బెదిరింపులకు పాల్పడలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదని అన్నారు. తెలంగాణా ఉద్యమం లో తాము కూడా క్రియాశీలకంగా వ్యవహరించామని, అయితే గాంధేయ మార్గాన్ని వీడలేదని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అన్ని పధకాల అమలు సాఫీగా సాగుతోందని, లబ్దిదారుల ఎంపిక లో కూడా పారదర్శకంగా వ్యవహరిస్తూ దళారీల ప్రమేయాన్ని పూర్తిగా నివారిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో సికింద్రాబాద్ ను అగ్ర స్థానంలో నిలుపుతున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా చేపడుతూ ప్రజలకు ఉపకరిస్తున్నామని అన్నారు. తమకు భారీ ఆధిక్యతను చేకూర్చాలని, సీ ఎం కెసిఆర్ కు హ్యాట్రిక్ తధ్యమని అన్నారు. —

Whatsapp Image 2023 11 01 At 5.03.06 Pm

SAKSHITHA NEWS