SAKSHITHA NEWS

అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి

-సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం నగరంలో డయాగ్నస్టిక్ కేంద్రాలు నిలువు దోపిడీకి అడ్డాలుగా మారాయని ఆసుపత్రి వర్గాలు ల్యాబ్ యజమానులు కుమ్మక్కై రోగులను పిండి పిప్పి చేస్తున్నారని ఇలాంటి సెంటర్లపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ అవసరం లేని పేషెంట్లకు సైతం వేలాది రూపాయలతో స్కానింగ్ చేస్తూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నరని ఆయన మండిపడ్డారు హాస్పిటల్స్ డయాగ్నస్టిక్స్ సెంటర్స్ కుమ్మక్కై అదనపు ధరలు వసూలు చేస్తున్నారని నాణ్యమైన రిపోర్టులు కూడా చేయకుండా మొక్కుబడిగా తూతూ మంత్రంగా చేస్తున్న వైనం బహిరంగ రహస్యమైనని ఈ దోపిడీపై అధికారులు స్పందించి అధిక ఫీజులు తప్పుడు స్కానింగ్లు అవసరం లేకుండా చేస్తున్న సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు


జిల్లాలో ఆకాల వర్షంతో పంటలు, పండ్లు కూరగాయలు తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఎన్ఎస్పి క్యాంపులో రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మాస్ లైన్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఖమ్మం జిల్లాలో 11 మండలాల్లో 548 మంది రైతులు చెందిన 2000 ఎకరాలలో మామిడి తోటలో బొప్పాయి తోట దెబ్బతిన్నాయని అదే విధంగా ఇండ్లు రేకుల షెడ్లు కుప్పకూలాయని విద్యుత్ తీగలు వేలాడటం వెళ్లాయని వల్ల పశువులు మృతి చెందాయని ఆయన వివరించారు ఈ అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్నే పేదలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ నాయకులు కే శ్రీను సురేష్ అశోక్ లక్ష్మణ్ తదితరులు

WhatsApp Image 2024 05 15 at 18.04.09

SAKSHITHA NEWS