సాక్షిత : మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం: నిజాంపేట్ కార్పొరేషన్ 18 డివిజన్ పరిధి లోని సర్వే నెంబర్ 485, 486 రేణుక ఎల్లమ్మ కాలనీ లేఔట్ లోపార్క్, షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ఆక్రమణ మరియు షాపింగ్ కాంప్లెక్స్ స్థలంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ నుండి కలెక్టర్ వరకు బీజేపీ నేతలు, కాలనీ ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోకపోవడమే కాకుండా, అధికార పార్టీ నాయకుడికి వత్తాసు పలకడంపై ఆదివారం కాలనీ ప్రజలతో భారీ ధర్నా చేయడమే కాకుండా, ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అభిషేక అగస్త్య మరియు డిఆర్ఓ లింగా నాయక్ లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కలిసి, వారికి అక్రమ నిర్మాణాలపై మరోసారి పిర్యాదు చేసారు. చర్యలు తీసుకొని యెడల భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు కాలనీ ప్రజల ఆస్తులను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికార పార్టీ నేతలకి అధికారులు సహకరించడం శోషనీయమని, తక్షణమే రేణుక ఎల్లమ్మ కాలనీ పార్క్ షాపింగ్ కాంప్లెక్స్ స్థలంలో అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని, లేనిచో బిజెపి ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకులు సతీష్, ప్రధాన కార్యదర్శి బిక్షపతి యాదవ్, సీనియర్ నాయకులు శేషారెడ్డి, కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రేణుక ఎల్లమ్మ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ఆక్రమణ, అక్రమ నిర్మాణం పై చర్యలు
Related Posts
లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా
SAKSHITHA NEWS లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…