సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాల సమీక్ష సమావేశం

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగ్రమిగా నిలుపుతున్నామని , గత ఏడాది కాలంలో జీ హెచ్ ఏం సీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.6 కోట్ల నిధులతో వివిధ పనులను ప్రారంభించామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యకలాపాల సమీక్ష సమావేశం సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఓ సమీక్షా సమావేశం జరిగింది. డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ శ్రీ దశరద్, జలమండలి జనరల్ మేనేజర్ రమణారెడ్డి, ఈ ఈ శ్రీమతి ఆశలత, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, బీ ఆర్ ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్ లతో పాటు అన్ని విభాగాల అధికారులు, నేతలు, స్థానిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 50 సంవత్సరాల్లో చెప్పట్టని ఎన్నో పనులను కేవలం గడచిన ఏడేళ్ళ వ్యవధిలోనే చేపట్టామని తెలిపారు.


సితాఫలమండీ ప్రభుత్వ కుట్టి వెల్లోడి ఆసుపత్రిని 75 పడకల స్థాయికి పెంచి కొత్త భవనాల నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించామని, త్వరలోనే తార్నాక, అడ్డగుట్ట దివిజన్లల్ మరో రెండు బస్తీ దవాఖానా లు ఏర్పాటు చేస్తున్నామని తెల్పారు. మనికేశ్వరి నగర్, చిలకలగుడా ఆర్ యు బీ ల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజురయ్యయని తెలిపారు. జంట నగరాల్లో అత్యధికంగా మహిళా పొదుపు గ్రూపులను రుణాలను అందించిన ఘనతను సాధించామని, 1977 పొదుపు సంఘాల్లో 449 సంఘాలకు రూ.19.98 కోట్ల మేరకు రుణాలను 2021 సంవత్సరం లో అందించామని తెలిపారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేద రోగులకు వైద్య ఖర్చుల నిధులను అందించామని, సుమారు 31౦0 మందికి రూ. 29 కోట్ల మేరకు నిధులను అందించామని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాకుండా పెళ్లి ఖర్చు కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పధకాన్ని వినోయోగించుకొని
ద్యరంగలో చేయుతకు కృషి చేస్తూ, రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా జూనియర్, డిగ్రీ కాలేజి సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ లో మంజూరు చేయించామని, ఈ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ భవనాల నిర్మాణానికి రూ.29.75 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించామని తెలిపారు. సికింద్రాబాద్ తో పాటు నగరంలో ఆదర్శంగా నిలిచేలా సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని సితాఫలమండీ లో ఏర్పాటు చేశామని తెలిపారు.
సితాఫలమండీ లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, బోయ బస్తీ, మధుర నగర్ కాలనీ లో ఫంక్షన్ హాల్ లను నిర్మించి పేదలకు మంచి సౌకర్యాల కళ్యాణ వేదికలను అధునాతన హంగులతో నిర్మించామని, అడ్డగుట్ట, లాలాపేట లో కొత్త గా రూ.9 కోట్ల ఖర్చుతో మరో రెండు ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామని, రూ.6 కోట్ల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వివరించారు. ఇప్పటికే ప్రారంభించిన వివిధ పనుల పురోగతిని సమీక్షించి, వాటిని వెంటనే పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. వారసిగుడా, చిలకలగుడా, లాలాగూడ, గోపాలపురం ట్రాఫిక్ కొత్త పోలీస్ స్టేషన్ల భవనాలకు ఏర్పాట్లు జరపాలని నిర్ణయించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page