*ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఉచిత వైద్యం అందించాలన్నదే జగనన్న వుద్దేశమని తెలిపారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నెహ్రూ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
నగరపాలక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రతి ఒక్కరు సవినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటున్నారని,ఉచిత వైద్యం, ఉచితంగా మందులు కూడా తీసుకుంటూ ప్రతి ఒక్కరు సంతృప్తి చెబుతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదని జగనన్న ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తున్నారని ఇలాంటి కార్యక్రమం ప్రజలకి ఎంతో ఉపయోగమని తెలిపారు. జగనన్న ఆరోగ్యం సురక్షగార ఒక రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, వారికి కావలసిన మందులు పంపిణీ చేసి వారిని దగ్గర ఉండి ఇంటి వద్దకే చేర్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఇంటి వద్ద నుండి రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాలంటరీ ద్వారా గాని సచివాలయ సిబ్బంది ద్వారా గాని తెలియజేస్తే ఇంటి వద్దకే స్పెషల్ వైద్యులు వచ్చి వైద్యం అందిస్తారని తెలియజేశారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలకు ఆరోగ్య సురక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బసవ గీత, వైఎస్ఆర్సిపి నాయకులు బాలసుబ్రమణ్యం, వైద్యులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,