SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 12 at 2.35.34 PM

సాక్షిత : చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ ప్రగతి యాత్ర ముఖ్య ఉద్దేశం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
100 రోజుల ప్రగతి యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు కాలనీలలో పర్యటన..
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మరియు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో 6000 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసాం..
ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గంలో గులాబీ జండా ఎగరేసి హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ ని గెలిపించి చరిత్ర సృటించబోతున్నాం..


రూ. 2 కోట్ల 37 లక్షల వ్యయంతో బాచుపల్లిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 వ వార్డు బాచుపల్లిలో 100 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , కమీషనర్ రామకృష్ణ రావు , స్థానిక కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు..నిర్విరామంగా 99 రోజులు పూర్తి చేసుకొని వందో రోజుకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ హోమ్స్ కాలనీ, SJB హోమ్స్ కాలనీ, నందనవనం కాలనీ, రేణుక ఎల్లమ్మ కాలనీ, సాయి అనురాగ్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ రూ. 2 కోట్ల 37 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో 6000 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసాం అని,100 రోజుల ప్రగతి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని, ప్రగతి యాత్ర మొదలు పెట్టిన నుండి వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాలనీలో మిగిలిన ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందిచి ముందుకు సాగుతున్నామని, ఈ ప్రగతి యాత్రలో భాగంగా తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రజల సహకారంతో దాదాపుగా పరిష్కరించుకోగలిగామని వారు తెలిపారు.అలాగే ప్రజల అండ దండలతో వారి ఆశీస్సులతో నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో గులాబీ జండా ఎగరేసి హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ ని గెలిపించి చరిత్ర సృటించబోతున్నం అని ఎమ్మెల్యే తెలిపారు..

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు – సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS