షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక సౌరభం చోటు చేసుకుంటుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తెలిపారు.
గురువారం ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి, శివలింగ, మహా గణపతి, కుమార స్వామి నవగ్రహ సహిత జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామ సర్పంచ్ బసిరెడ్డి పద్మా నరేందర్ రెడ్డి దేవాలయాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ లతో కలసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్. బసిరెడ్డి పద్మా నరేందర్ రెడ్డి ,తుపాకల శేఖర్ పాల్గొన్నారు..