A round table meeting of Zakiya parties and public associations was held.
బహుజన సమాజ్ పార్టీ(BSP) ఆధ్వర్యంలో బీసీల జనగన కోసం వివిధ రాజకీయ పార్టీల మరియు ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షితన్యూస్ డిసెంబర్ 20)తాండూర్ పెద్దేముల్ రోడ్ వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హలలో బీసీల కులగనన, రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి B.చెంద్రశేఖర్ మూదిరాజ్ అధ్యక్షులు, బహు జన సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, అబ్బని బసయ్య బీసీ బలహీన వర్గాల సంక్షేమ సంఘం స్టేట్ కార్యాదర్శి, K. శ్రీనివాస్ సిపిఎం జిల్లా కార్యదర్శి, బుగ్గప్ప రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, అరుణ్ కుమార్ BSP యువనాయకులుమరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు
ఈసందర్బంగా చెంధ్రశేఖర్ నాయకులు,మాట్లాడుతూ భారత దేశంలో 76 సం.ల స్వాతంత్రములో బీసీల కుల గనన జరుగడం లేదు, అంటే 70 శాతం ఉన్న బీసీ లు అభి వృద్ధి చెందకుండ, దేశం అభి వృద్ధి జరుగదన్నారు.1990 సంవత్సరము లోనే EBC లకు విద్య ప్రభుత్వ ఉద్యోగంలో 27%దాన్ని కోర్టుల ద్వారా రద్దు చేయించారు.BP మండల్ కమీషన్ సి పార్సులతో మాజీ ప్రధాని వీపీ సింగ్ బీసీల కొరకు ఎంతో కృషి చేశారన్నారు.
బీజెపి , కాంగ్రెస్ పార్టీలలో ఉన్న బీసీ నాయకులు ఈ విషయం తెలుసు కో లేకపోతున్నరన్నారు, అందుకే BSP RS ప్రవీణ్ కుమార్ బీసీల కొరకు ముందడుగు వేసి బీసీ ల జనగనన జర్పే వరకు పోరాటం చేయాలనీ పూ నుకున్నారన్నారు. అందుకే రాబోవు ఎన్నికల లో కూడా బీసీల కు 70 MLA సీట్లు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో ఉన్న BRS, బీజేపీ,కాంగ్రెస్ టీడీపీ ఏపార్టిలైన 70 MLA ల సీట్లు ఇచ్చే దముందా??
అని సవాల్ విసిరి నారు.ముఖ్యంగా తాండూర్ లో BRS, BJP, congress,పార్టీల లో ఉన్న బీసీ లు వాళ్ళ హాక్కులు తెలుసుకో లేక పోవడమే చాలా భాధాకర విషయమని, ఆవేదన చెందుతున్నమన్నారు. బీసీల కుల గనన డిమాండ్ చేయని పార్టీలా జెండాలు మోస్తున్న రన్నారు. కనీసం అపార్టీ లలో కూడ బీసీ ల కుల గనన చేయాలనీ వాళ్ళ మేని ఫెస్టో లో పెట్టాలని డిమాండ్ చేయాలన్నారు. లేదంటే మీ పార్టీ లకురాజీనామా చేస్తామని చెప్పాలన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థలను ప్రయివేట్ చేస్తూ రిజర్వేషన్ లు లేకుండా చేస్తున్న ధన్నారు. ఇప్పటికైనా బీసీలురాజకీయ చైతన్యం కావలసిన అవసరం ఉందన్నారు.ఈ రౌండ్ టేబుల్ వర్క్ షాపులు ప్రతి మండలం లో పెట్టి బీసీ లను రాజకీయ చైతన్యం BSP ఆధ్వర్యంలో చేస్తామని తెలియ జేశారు.ఇందుకు బీసీ లు అందరూ హార్థి కంగా, ఆర్థికంగా పాల్గొనలని కోరినారు.