కృష్ణాజిల్లా గుడివాడలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది, లక్ష్మీ రామ సెంటర్లో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న కారు కొంత దూరం ఈడ్చు కేళ్లడంతో,ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఇరువురిని హాస్పిటల్ కు తరలించగా, చికిత్సలు అందించిన వైద్యులు ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులు మండవల్లి మండలం చావలిపాడుకు చెందిన అక్షయ్, నవీన్ గా పోలీసులు గుర్తించారు. చావలపాడు నుండి విజయవాడ అమ్మవారి గుడికి పాదయాత్రగా వెళుతున్న బృందానికి అక్షయ్, నవీన్ అల్పాహారం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సహచరులు చెప్పారు.
లక్ష్మి రామా సెంటర్లో రోడ్డు ప్రమాదం ఇరువురికి తీవ్ర గాయాలు….. పరిస్థితి విషమం
Related Posts
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…
జనసేన యువ నాయకులు
SAKSHITHA NEWS జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి…