జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్
…….
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
రానున్న లోకసభ ఎన్నికల నిర్వహణకై పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1459 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పీవో, ఏపీవో, ఎంవో ల జాబితా సిద్ధం చేయాలన్నారు. వాస్తవ సిబ్బంది ఆవశ్యకతతో పాటు, రిజర్వ్ సిబ్బంది జాబితాలో ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు 5840 మంది సిబ్బంది అవసరం ఉండగా, 20 నుండి 30 శాతం రిజర్వ్ సిబ్బందితో కూడిన జాబితా సిద్ధం చేయాలన్నారు. నిబంధనల మేరకు పే స్కెల్, కేటగిరిని బట్టి, పీవో, ఏపీవో, ఓపివో ల నియామకం చేయాలన్నారు. ఎంపికచేసిన సిబ్బందికి సమాచారం అందించి, శిక్షణలో పాల్గొనేలా చర్యలు చేపట్టి, మొదటి విడత శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, ఏఎస్వో కిషోర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.