SAKSHITHA NEWS

A large open meeting under the auspices of Jamiate Ahale Hadith Karimnagar District Committee

image 26

హుజూరాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ జమీయతే అహలే హదీస్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది

హుజరాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్ లో జామేయత్ అహిలే హదీస్ ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు యూసుఫ్ జానీ గారి ఆధ్వర్యంలో ఈ సభ మగ్రీబ్ నమాజ్ నుండి ప్రారంభమై ప్రసంగికులు బ్రదర్ ఫయాజ్, యూసఫ్ జామయి గార్లు ప్రసంగిస్తూ మరణంత్ర జీవితం ఉంది అని అది మన ఇహలోక జీవితానికి అనుగుణంగా మనము మంచి జీవితం గడిపినట్లయితె మరణం తర్వాత స్వర్గం పొందుతామని అలా కాకుండా అన్యాయం, మోసం అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపితే మరణం తర్వాత మహా భయంకరమైన నరకానికి వెళ్తామని అలాంటి నరకం నుండి రక్షణ పొంది సామరస్యమైన శాంతియుతమైన జీవితం మనం పాటించాలని సందేశం ఇచ్చారు జబ్బార్ సాబ్ , అబ్దుల్లా హస్సైని గార్లు మాట్లాడుతూ ముహమ్మద్ ప్రవక్త గారి సహచరులు యావత్తు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసి దౌర్జన్యాలను భరిస్తూ ముహమ్మద్ ప్రవక్త గారి చూపిన మార్గాన్ని వారు ప్రపంచానికి ఎలా పరిచయం చేసారో వారి త్యాగాలు ఎలాంటివో తెలియజేశారు మౌలాన యూసుఫ్ మొహమ్మది గారు అందరు కూడా కలిసిమెలిసి ఉండాలని కలిసి ఉండటంలో సమాజంలో శాంతి సహోదర సౌబ్రతత్వం వ్యాపిస్తుందని తెలియజేశారు అబ్దుల్ జబ్బార్ గారు మాట్లాడుతూ ఇస్లాం మానవాళికి సన్మార్గం చూపుతోందని మహా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయమని ప్రతి ఒక్కరు కూడా అల్లా గురించి మొహమ్మద్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు అంతిమంగా సభలో సభాధ్యక్షులు యూసఫ్ జానీ గారు మాట్లాడుతూ ఇలాంటి సభలు మేము తరచు నిర్వహిస్తూ సమాజంలో ఐక్యత శాంతి వ్యాపింప చేస్తూ సామాజిక రుగ్మతలను తొలగించడంలో కృషి చేస్తుంటామని.. వచ్చిన అతిథులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి సభను ముగించారు ఈ సభలో జమీయతే అహలే హదీస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా సోఫియాన్ గారు, కరీంనగర్ జిల్లా జమీయత అహ్లేహదీస్ కార్యదర్శులు యూసఫ్ మహమ్మద్ , మహమ్మద్ ఫరూక్ అలీ కోశాధికారి , సభ నిర్వహణ కర్త సఫియుర్రహమన్ ఇస్మాయిల్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బందే అలీ గారు,
అక్బర్ గారు, జావిద్ గారు ,
హుజరాబాద్ జమా మజీద్ అధ్యక్షులు ఖాజీ అబ్దుల్ ఫాయిమ్ గారు , కరీంనగర్ టౌన్ అధ్యక్షులు షేక్ జావిద్ , ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్ సాబ్ , హుజురాబాద్ ఈద్గా ఖబ్రాస్తాన్ అధ్యక్షులు ముజాహిద్ , శాంతి నగర్ మజీద్ అధ్యక్షులు అహ్మద్ మొహమ్మద్ గార్లు వివిధ మండలాల గ్రామాల ప్రాంతం ముస్లిం సోదరులు , సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS