విశాఖ
చంద్రంపాలెం
జిల్లా పరిషత్ హై స్కూల్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘోర ఆహ్వానం జరిగిందని దళిత నాయకులు డాక్టర్ దీనబంధు ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు అయినప్పటికీ పిల్లలకు సెలవు ప్రకటించకుండా స్కూలు పెట్టడం అంబేద్కర్ ని అవమానించడమే అని అన్నారు.
స్కూల్ పెట్టినప్పటికీ కనీసం అంబేద్కర్ కి నివాళులర్పించకపోవడం, పిల్లలకు అంబేద్కర్ ఆశయాలను తెలపకపోవడం బాధాకరమన్నారు.రాష్ట్రంలోనే అతిపెద్ద పాఠశాల ఉన్న చంద్రంపాలెం స్కూలు పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతకు సరిపోతుందన్నారు.కనీసం అత్యధిక విద్యార్థులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల కల పాఠశాలలో కనీసం అంబేద్కర్ చిత్రపటం లేకపోవడం విచారకరమన్నారు. రాజకీయ వత్తులకు తలబ్ది అంబేద్కర్ లాంటి మహనీయుల్ని అవమానపరిస్తే సహించేది లేదని దీనిపై ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని తెలిపారు.కార్యక్రమంలో ఏ. పి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ మూర్తి మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.