డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి.

Spread the love

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి.

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పిలుపు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,

మహోన్నత నేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు.

మైలవరంలోని విజ్ఞేశ్వర హోటల్ ఎదురుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి కూడా పూలమాలలువేసి నివాళులర్పించారు.

నేను, నా దేశం అని చెప్పాల్సి వస్తే.. నా దేశమే నాకు అత్యంత ముఖ్యమైనదని చాటిన గొప్ప దార్శనికులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page