A gift to the Murali family on the occasion of the emergence of Jap
జాప్ ఆవిర్భావం సందర్భంగా మురళి కుటుంబానికి చేయుత
సాక్షిత తిరుపతి : జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న జాప్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం మరణించిన సీనియర్ కెమెరామెన్ మురళీ జ్ఞాపకార్థం వారి కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులను అందజేయడం జరిగిందని జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేంధర్ రెడ్డి, జాప్ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్ అన్నారు.
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) 30వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో జాప్ ఆధ్వర్యంలో కేట్ కటింగ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కల్లుపల్లి సురేంధర్ రెడ్డి, విజయ్ యాదవ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జాప్ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులైన పున్నంరాజు, యుగంధర్ రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. మురళీ కుటుంబానికి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందించిన ఆర్.ఆర్ పౌండేషన్ రమణ యాదవ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.
జాప్ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా జాప్ నాయకులకు తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలచంధ్ర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు మునికృష్ణయ్య, సెల్వం, మోహన్ గౌడ్, రోషన్, వరా, కెమెరామెన్ల అసోసియేషన్ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.*