SAKSHITHA NEWS

భూముల పేరుతో డ్రామా: రైల్వే జోన్ సాధన కమిటీ

రైల్వే జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, ఇతర పనులు ప్రారంభం కాకపోవడంపై రాష్ట్రం, కేంద్రం ఆడుతున్న డ్రామగానే చూడాలని రైల్వే జోన్ కోసం పోరాటాలు చేసిన సంఘాలు అంటున్నాయి.

విశాఖ రైల్వే జోన్ సాధన కమిటీ కన్వీనర్ జేవీ సత్యనారాయణ (నాని) బీబీసీతో మాట్లాడుతూ… కేవలం భూమి సమస్య వలనే ఇంకా రైల్వే జోన్ పనులు ప్రారంభం కాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

‘‘నిజానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉంది. ఎటువంటి వివాదాల్లేని భూములు ఇవ్వాలి. అంతేకానీ వివాదస్పద భూములు ఇవ్వడం, దానికి కేంద్రం మాకు భూములు అందలేని చెప్పడం చూస్తుంటే ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ ఇక్కడ రైల్వేజోన్ లేకుండా చేస్తున్నారు’’ అని జేవీ సత్యనారాయణ ఆరోపించారు.

డీపీఆర్ అమోదం పొందిన తర్వాత ఏదో ఒక పని ప్రారంభిస్తే జోన్ పనులు మొదలైనట్లు అవుతుంది. అంతేకానీ ఈ భూములిస్తేనే పనులు ప్రారంభిస్తామని చెప్పడం కేంద్రం ఆడుతున్న నాటకంలా అనిపిస్తోందని పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

జోన్ ఏర్పాటు సౌకర్యాలు, సమస్యలు, భూ సేకరణ, ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలతో కూడిన డీపీఆర్ ఆమోదం పొందితే చాలు రైల్వే జోన్ పనులు ప్రారంభించవచ్చు అని గతంలో బీబీసీతో మాట్లాడిన అప్పటీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఎస్.ఎస్ శ్రీనివాస్ అన్నారు.


SAKSHITHA NEWS