SAKSHITHA NEWS

నేను జాతకాలు నమ్మను.
— అవును అది మీ జాతకంలోనే ఉంది.
నేను దేవుడిని నమ్మను.
—- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.

నాకు దేవుడిని చూపించగలరా?
—- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.

ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
—– మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.

మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
—- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?

దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
—– ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా

దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
—- నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.

దేవుడిని తలచుకోకపోతే జరగదా?
— ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా…

ఇంకేముంది గోగినేని తలవంచుకుంటు వెనుదిరిగారు

Whatsapp Image 2024 01 12 At 2.24.27 Pm

SAKSHITHA NEWS