SAKSHITHA NEWS

A child was sexually assaulted and then murdered in Peddapally district.

పెద్దపల్లి జిల్లాలో చిన్నారిపై లైంగిక‌దాడి, ఆపై హ‌త్య‌..

సిసి ఫుటేజీలో చిన్నారిని ఎత్తుకెళ్తున్న దృశ్యం

పెద్దపల్లి జిల్లా:
ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో జ‌రిగింది.

ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలానికి చెందిన వ్యక్తి సుల్తానాబాద్ మండలంలోని మమత రైస్ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. రాత్రి సమయంలో పాప నిద్రపోతుండగా రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు బాలికను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డి, చంపేశాడు.

అక్క‌డి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రాత్రంతా గాలించి నిందితుని పట్టుకున్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.

నిందితుడు మైనర్‌ బాలిక ను ఎత్తుకెళ్లిన విషయాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. విచార‌ణ జ‌రిపి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకో నున్న‌ట్టు పోలీసులు తెలిపారు…


SAKSHITHA NEWS