మహబూబాబాద్ జిల్లా:
తెలంగాణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నందుకు మంత్రి సత్యవతి రాథోడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతోంది. ఎన్నికల ప్రచారం అన్ని నియోజకవర్గాల్లో జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు నానా తంటాలు పడుతున్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలలోని కొంగర గిద్దె గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికిన మహిళలు ఆమెకు మంగళ హారతి ఇచ్చారు.
అయితే తన కారు దగ్గరికి వచ్చి తనకు హారతి ఇచ్చినందుకుగాను పళ్లెంలో మంత్రి నాలుగు వేల రూపాయలు వేశారు. ఇప్పుడిదే వివాదాస్పదమైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఆమె డబ్బులిచ్చారని.. గూడురు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఎస్టీ టీమ్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
మంత్రి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయ త్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గూడూరు పోలీసులు మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు చేశారు.
మంత్రిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన 171-E,171-H ఐపీసీ r/w188 ioc సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు
మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు
Related Posts
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న అల్లు అర్జున్ అభిమానులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. SAKSHITHA NEWS
అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం..
SAKSHITHA NEWS అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలుఅల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని.. ప్రముఖ…