పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని చెప్పిన జిల్లా ఎస్పీ Y.రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ ,.*
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు వారు రిమాండ్ విధించిన నేపథ్యంలో టిడిపి పార్టీ వారు (11.09.2023) రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన దృష్ట్యా అప్రమత్తమైన పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం.
జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదనీ,పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ ఎస్పీ
సామాన్య ప్రజల దైనందిన జీవనానికి మరియు రోజువారీ కార్యక్రమాలకు ఎలాంటి అసౌకర్యం కలిగించరాదు.ఆజ్ఞలు అతిక్రమిస్తే చర్యలు తప్పవనీ హెచ్చరిక చేసిన ఎస్పీ .
ప్రజలు సంయమనం పాటించి పోలీస్ వారికి సహకరించాలని సూచన.పోలీస్ వారు జారీ చేసిన నియమ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పైకి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు తప్పవనీ తెలిపిన ఎస్పీ ..