ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డ్ ని అభివృద్ధి చేస్తున్నం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
డి పోచంపల్లి వార్డ్ నెంబర్ : 6 లో 20లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ పర్యటించారు.అనంతరం 20లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
కాగా అక్కడక్కడా నెలకొన్న భూగర్భడ్రైనేజీ, అంతర్గత రోడ్లు, కరెంటు పోల్స్, తీగలు మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డ్ ని అభివృద్ధి చేస్తున్నం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానిక నాయకులూ, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరుల పాల్గొన్నారు.