SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 26 at 11.37.12 AM

ఎమ్మెల్యే చెన్నమనేనికి కీలక బాధ్యతలు

రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియామకం

కేబినెట్ హోదాతో ఐదేళ్ల పదవి

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఆయన్ను నియమించారు. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో రమేష్ బాబు ఐదేళ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనుంది.

విద్యాధికుడైన చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక హంబోల్ట్ యునివర్సిటీ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’లో పరిశోధనలు చేసి హీహెచ్‌డీ పట్టాను పొందారు.రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా రమేష్ బాబుకు అగ్రికల్చర్ ఎకానమీ అంశం పట్ల ఉన్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన్ను రాష్ట్ర వ్యవసాయ రంగం వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.


SAKSHITHA NEWS