సాక్షిత : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని స్రావ్వ – స్వాతిక అపార్ట్మెంట్ మరియు ఆపిల్ అపార్ట్మెంట్ ను ఆనుకోని చేపట్టిన భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం వలన ప్రహరీ గోడ కూలిపోగా విషయం తెలిసిన వెంటనే కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , GHMC అధికారులతో కలిసి హుటాహుటిన అర్థరాత్రి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, అపార్ట్మెంట్ వాసులకు భరోసా కలిపించి సహాయక చర్యలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సెల్లార్ పూడిక తీత వలన అపార్ట్మెంట్ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అని, విషయం తెలియగానే ,కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పర్యటించడం జరిగినది అని, సెల్లార్ తీసిన బిల్డర్ తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, బారికేడ్లు ,ఇసుక బస్తాలు వేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ,ప్రజలకు అపార్ట్మెంట్ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని బిల్డర్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగినది.వర్షాకాలం ను దృష్టి లో పెట్టుకొని అన్ని రక్షణ చర్యలు, బారి కేడ్లు చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు, వర్షాకాలంలో సెల్లార్లు తీయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగినది , కాలనీ వాసులు ధైర్యంగా ఉండలని, అధైర్యపడకూడదని మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. చిన్న పిల్లలు, పెద్దలు , కాలనీ వాసులు అటు వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ,స్వీయ రక్షణ చర్యలు పాటించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శ్రీనివాస్,AE సునీల్ మరియు అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.