SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 25 at 1.14.05 PM

మణిపూర్ మారణహోమం పై ప్రధాని రాజీనామా చేయాలి.
మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త రఫ్ చేయాలి …
సిపిఎం,సిపిఐ డిమాండ్
సూర్యాపేట:మణిపూర్ రాష్ట్రంలో గత 83 రోజులుగా మారణ హోమం జరుగుతున్నదని, వందల మంది ఆదివాసి తెగలు, ఇతర ప్రజలు హత్యలకు గురిచేస్తూ మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ భారతావని సిగ్గుతో తలదించుకునే విధంగా జరుగుతున్నా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైనందున ఆ సంఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ రాఘవ ప్లాజా నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మణిపూర్ రాష్ట్రంలో వందలకొద్దీ హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నందున ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రివ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర బిజెపి పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో వందల కొద్ది ఘటనలు జరిగాయని ఆ ఘటనలో అనేకమంది అత్యాచారాలకు గురయ్యారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. ఆదివాసీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.గత మూడు నెలల నుండి మణిపూర్ లో మారణ హోమం జరుగుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, విదేశాలు తిరగడం చేశారే తప్ప ఆ రాష్ట్రంలో పర్యటించి శాంతిని నెలకొల్పలేక పోయారని విమర్శించారు. ప్రధాని ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఇంతటి దారుణాలు వందల కొద్ది మరణాలు, మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగేవి కావని కావన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్న ప్రధాని స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కుకీ గిరిజన తెగకు సంబంధించిన ఒకరిని తల నరికి తడకకు వేలాడదీశారంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయాందోళన వాతావరణం ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా గిరిజన తెగలు, ఇతర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్న మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరగడానికి బిజెపి అనుసరించిన మతోన్మాద రాజకీయాలే కారణమని ఆరోపించారు. దేశ రక్షణ కోసం పని చేసిన ఒక సైనికుడి భార్యని తన కళ్ళముందే బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేయడం భారతమాత సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి అనుసరిస్తున్న విద్వేష, మతోన్మాద విధ్వంసకర విధానాలకు మణిపూర్ మారణ హోమం ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. సైన్యం, పోలీసుల కళ్ళెదుటే ఇంతటి దారుణాలు జరుగుతుంటే అరికట్టలేని ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి అర్హత లేదని రద్దు చేసిశాంతినినెలకొల్పెందుకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలకు పాల్పడిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేకల శ్రీనివాస్,ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్,వేల్పుల వెంకన్న,కొప్పుల రజిత, మేకనబోయిన సైదమ్మ, వీరబోయిన రవి, మేకన పోయిన శేఖర్, చిన్నప్పంగ నరసయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సిపిఐ
రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లవుల రాములు, అనంతుల మల్లేశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, ఉస్టెల నారాయణరెడ్డి, ఎల్లావుల రమేష్, దేవర మల్లేశ్వరి, మండవ వెంకటేశ్వర్లు,ఎల్లంల యాదగిరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బూర వెంకటేశ్వర్లు ఎస్కే లతీఫ్ సారెడ్డి పాపిరెడ్డి చింతిరాల రవి నిమ్మల ప్రభాకర్ సిపిఎంనాయకులు మందడి రామ్ రెడ్డి వల్లపు దాసు సాయికుమార్ మామిడి సుందరయ్య బచ్చలకూర రాంబాబు యాతాకుల ప్రవీణ్ బానోత్ వినోద్ నాయక్ నంద్యాల కేశవరెడ్డి నారాయణ వీరారెడ్డి గట్టుపల్లి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS