SAKSHITHA NEWS

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఎంటమాలజీ సిబ్బందితో కలిసి పర్యటించి వాతావరణ మార్పుతో వచ్చే డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధులు గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీజన్ మార్పుతో వాతావరణంలో వచ్చే సూక్ష్మక్రిముల కారణంగా వైరల్ జ్వరాలు ప్రజలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇల్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మన ఇంటి పరిసరాలలో అనగా నల్లగుంతలు, కూలర్స్, పూల కుండీలు, డ్రమ్ములు, టైర్లు, పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, మట్టి కుండలు, బిల్డింగ్ పైన ఉండే సింటెక్స్లు, సిమెంటు గోళాలు మొదలగు వాటిలో ఎక్కువ రోజులు నీరు నిలువ లేకుండా ప్రతి ఒక్కరు చూసుకోవాలని, అదేవిధంగా మన ఇంటి పరిసరాల లోపట నీరు నిలువ ఉన్న పాత్రలను వారానికి ఒకసారి అట్టి నీటిని చేంజ్ చేసి మరలా నీటిని నింపవలెనని ప్రజలకు సూచించారు. నిలువ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి దోమల సంతానాన్ని ఉత్పత్తి చేసి అవి గుడ్డు నుంచి దోమగా తయారు కావడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది కాబట్టి దోమ కాటు ద్వారా మనకి డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ బ్రెయిన్ ఫీవర్ బోదకాలు మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండి అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, షౌకత్ అలీ మున్నా, బి.వెంకటేష్ గౌడ్, పోశెట్టిగౌడ్, మహేష్, ప్రశాంత్, ఎంటమాలజి సూపర్వైజర్ నరసింహులు మరియు ఎంటమాలజి సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS